బాబు కి షాక్ : ఇంకొ టీడీపీ ఎమ్మెల్యే అవుట్ !

Jagan 1
PTI | Updated :September 22, 2020,20:17 IST

విశాఖ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీ గూటికి చేరారు. వైసీపీ సిద్దాంతం ప్రకారం.. ఆయన కండువా కప్పుకోలేదు కానీ.. ఆయన కుమారుడికి కప్పించారు. దాంతో ఆయన కూడా అనధికారికంగా వైసీపీ సభ్యుడైపోయారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుల్లి గణేశ్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ ముఖ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వాసుపల్లి గణేశ్‌ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా కుమారులు వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు. ఆయన ధైర్యమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతున్నాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది. టీడీపీ ఇక ముందుకు వస్తుందని నాకు అనిపించడం లేదు’అని పేర్కొన్నారు.

 

From Around the web