బాలీవుడ్ 2 టాలీవుడ్ డ్రగ్స్ కేసు కలకలం!

Kangana ranaut 571 855
PTI | Updated :September 22, 2020,19:55 IST

ప్రస్తుతం బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త పేరు వెలుగులోకి వస్తోంది. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పేరు బయటికి రావడం సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని జాతీయ న్యూస్ చానళ్లు నమ్రతా పేరును ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. టాలెంట్ మేనేజర్ జయా సాహాతో ఆమె వాట్సాప్‌లో ఛాటింగ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, క్రిటిక్ సుమిత్ కడేల్ సైతం ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. ఆజ్ తక్ చానెల్ ఈ మేరకు కథనాన్ని ప్రసారం చేసినట్టు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

బాంబేలో మంచి ‘ఎండీ’ ఇస్తానని ప్రామిస్ చేశావ్. ఎండీ ఇచ్చాక మనం పార్టీ చేసుకుందాం’ అంటూ నమ్రత చాటింగ్‌ చేసినట్లు నేషనల్‌ మీడియా చెబుతోంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు జయ సాహాను విచారించారు. ఈ సందర్భంగా నమ్రతకు తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రకుల్‌‌ప్రీత్ సింగ్ పేరు బయటికి రావడంతో టాలీవుడ్ షాకైన సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ సతీమణి నమ్రత పేరు వెలుగులోకి రావడంతో మరింత కలకలం రేపుతోంది.