హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తోన్న దుల్కర్‌‌

Dulquer
PTI | Updated :July 28, 2020,16:41 IST

‘మహానటి’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ఈ చిత్రంలో దుల్కర్‌ జెమినీ గణేషన్‌ పాత్రలో నటించి.. ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలో మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దుల్కర్‌ సల్మాన్‌. ‘పడి పడి లేచే మనసు’ సినిమా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ రోజు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. 

‘మహానటి’ సినిమాను నిర్మించిన స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నది. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.

Source : Sakshi