సుప్రీం తీర్పును ఏపీ ప్రభుత్వం గ్రహించాలి

3c446bea a70d 4e9b 8c9b 8246ccbf590b
PTI | Updated :July 14, 2020,16:41 IST

అమరావతి: కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణపై సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఓ మైలురాయి అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ట్రస్టుల నిర్వహణలో సంప్రదాయాల పవిత్రతను ధర్మాసనం రక్షించిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం గ్రహించాలన్నారు. సింహాచలం బోర్డు, మాన్సాస్‌ ట్రస్టులో జోక్యం మానేయాలని డిమాండ్‌ చేశారు. కుటుంబం నడిపే ట్రస్టులో జోక్యం సరికాదని హితవు పలికారు.

కంపెనీలకే వత్తాసు పలుకుతారా?
పదిహేను రోజుల్లో 2 దుర్ఘటనలు, రెండు నెలల్లో 3 కంపెనీల్లో ప్రమాదాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పార్టీ సీనియర్‌ నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎల్జీపాలిమర్స్‌ ఉదంతం, రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌లో వరుసగా దుర్ఘటనలు జరిగాయన్నారు.బాధితులను ఆదుకునే చర్యలు తీసుకోకుండా కంపెనీలకే అధికార వైకాపా వత్తాసు పలుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రామాదాల నివారణపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం హేయమని ఆవేదన వ్యక్తం చేశారు.

Source  : Eenadu