నెగటివ్‌ వస్తే.. మళ్లీ పరీక్షలు చేయండి

Apgovtaa
PTI | Updated :July 13, 2020,20:45 IST

అమరావతి: కరోనా అనుమానితుల పరీక్షలకు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లు వాడాలని ఏపీ వైద్యారోగ్య శాఖ కోరింది. జిల్లాలకు 20 వేల చొప్పున ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు కిట్లను పంపినట్లు వెల్లడించింది.యాంటీజెన్‌ పరీక్షలో పాజిటివ్‌ తేలితే వెంటనే చికిత్స ప్రారంభించాలని సూచించింది. సదరు రోగిని ఐసోలేట్‌ చేయాలని కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలకు సూచించింది. కరోనా లక్షణాలు ఉండి యాంటీజెన్‌ పరీక్షలో నెగటివ్‌ వస్తే ఆర్టీపీసీఆర్‌ చేయాలని ఆదేశించింది. అందులోనూ నెగటివ్‌ వస్తే మరోమారు రియల్‌ టైమ్‌లో ఆర్టీపీసీఆర్‌ చేయాలని కోరింది. హైరిస్కు కేసులు గల ప్రాంతాలు, కంటైన్మెంట్‌ జోన్లలో విరివిగా పరీక్షలు చేయాలని సూచించింది. వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగటివ్‌ ఫలితాలు వచ్చినా పరీక్షించాలని కోరింది. గర్భిణిలు, శస్త్రచికిత్స చేయాల్సిన రోగుల పరీక్షకు, ఆస్పత్రుల్లో చేరేటప్పుడు అనుమానితుల పరీక్షలకు ఈ కిట్లు వాడాలని ఆదేశించింది.

Source : EEnadu