నాలో అభిమానిని తట్టి లేపింది మీరే: బాలయ్యకు ఎన్టీయార్ విషెస్

06102020094611n69
PTI | Updated :June 10, 2020,04:51 IST

తనకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో నటరత్న నందమూరి బాలకృష్ణేనని యంగ్ టైగర్ ఎన్టీయార్ తెలిపాడు. ఈ రోజు (బుధవారం) బాలకృష్ణ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా బాలయ్యకు ఎన్టీయార్ ట్విటర్ ద్వారా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. 

`నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే బాబాయ్. జై బాలయ్య` అంటూ ఎన్టీయార్ ట్వీట్ చేశాడు. 

 

Source: Sakshi