ఏపీలో మరో 68 కరోనా కేసులు

20ap1a 3
PTI | Updated :May 20, 2020,19:06 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.  గడచిన 24 గంటల్లో 9,159 మంది శాంపిల్స్‌ పరీక్షించగా 68 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,407 కి చేరింది.

 గడచిన 24గంటల్లో కరోనాతో కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. 43 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 53కు చేరింది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1639కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 715 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన కేసుల్లో  చిత్తూరులో 6, నెల్లూరులో 4 కేసులు తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌ నుంచి వచ్చిన వారివేనని అధికారులు తెలిపారు.

Source : Eenadu