హాస్యంతో అలరిస్తున్నారు: నమ్రత

Namrata
PTI | Updated :April 01, 2020,17:22 IST

కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చే వారిలో టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు ముందు వరుసలో ఉంటారు. సినిమా షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో గడిపే ఏ మధుర క్షణాన్ని ఆయన వదులుకోరు. తాజాగా మహేష్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌ వెల్లడించారు. మహేష్‌ తన కామెడీతో కుటుంబాన్ని అలరిస్తూ ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. సామాజిక దూరం పాటించండి. ఈ సమయంలో మహేష్‌ తన అద్భుతమైన హాస్యంతో మా పెదాలపై చిరునవ్వు అందిస్తున్నాడు. అతడు మా రాక్‌ సాలిడ్‌ హాఫ్‌. అతన్ని పూర్తిగా ప్రేమిస్తున్నాను’ అంటూ మహేష్‌ గురించి చెప్పుకొచ్చారు.

దేశంలో కోరలు చాచుతున్న కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ కాలంలో సినిమా షూటింగ్‌లన్నీ వాయిదా పడటంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఇంట్లో సరదాగా గడుపుతున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. కాగా కరోనాను ఎదుర్కొనేందుకు మహేశ్‌ సైతం పలు సూచనలు చేయడంతోపాటు తన వంతు బాధ్యతగా కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్‌ బాబు తన తర్వాతి సినిమా కోసం దర్శకుడు పరుశురామ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Source : Eenadu