ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

5brk ips1a
PTI | Updated :June 05, 2019,17:38 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 26 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే మంగళవారం రాత్రి సచివాలయంలోని పలువురు కీలక ఐఏఎస్‌ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం పలువురు ఎస్పీలు, డీఎస్పీలను బదిలీలు చేసేందుకు కసరత్తు చేసింది.  ఐపీఎస్‌ల బదిలీపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన డీజీపీ గౌతం సవాంగ్‌ ఇవాళ ఉదయం తాడేపల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో 26 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

అధికారి బదిలీ అయిన స్థానం
వెంకట్రామిరెడ్డి కర్నూలు రేంజ్‌ డీఐజీ
నాగేంద్రకుమార్‌ విజయవాడ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌
ఏఎస్‌ ఖాన్‌ డీఐజీ, ఏలూరు రేంజ్‌
సీఎం త్రివిక్రమ వర్మ సీఐడీ డీఐజీ
జి. శ్రీనివాస్‌ అనంతపురం పీటీసీ ప్రిన్సిపల్‌
ఆర్‌.ఎన్‌ అమ్మిరెడ్డి శ్రీకాకుళం ఎస్పీ
బి.రాజకుమారి విజయనగరం ఎస్పీ
నయీం అస్మి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
నవ్‌దీప్‌ సింగ్‌ గ్రేవాల్‌ పశ్చిమగోదావరి ఎస్పీ
రవీంద్రనాథ్‌ బాబు కృష్ణా జిల్లా ఎస్పీ
జయలక్ష్మి గుంటూరు రూరల్ ఎస్పీ
డీహెచ్‌బీ రామకృష్ణ గుంటూరు అర్బన్ ఎస్పీ
సీహెచ్‌. వెంకట అప్పలనాయుడు చిత్తూరు ఎస్పీ
సత్యయేసు బాబు అనంతపురం ఎస్పీ
సీహెచ్‌. విజయరావు డీసీపీ-2 విజయవాడ సిటీ
విక్రాంత్‌పాటిల్‌ డీసీపీ -1 విశాఖ సిటీ
ఉదయభాస్కర్‌ బిల్లా డీసీపీ -2, విశాఖ సిటీ
కోయ ప్రవీణ్‌ గుంతకల్లు రైల్వే ఎస్పీ
విశాల్ గున్నీ ఎస్పీ ఆక్టోపస్‌
రవిప్రకాశ్‌ ఎస్‌ఐబీ ఎస్పీ
జీవీఎస్‌ అశోక్‌కుమార్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ
సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎస్పీ, ఈవోడబ్ల్యూ, సీఐడీ
భాస్కర్‌ భూషణ్‌, ఎస్వీ రాజశేఖర్‌ బాబు, ఏఆర్‌ దామోదర్‌ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని ఆదేశం
రాహుల్‌ దేవ్‌ శర్మ గ్రూప్‌ కమాండర్‌ గ్రేహౌండ్స్‌

Source : Eenadu