భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

Modi pressmeet1a
PTI | Updated :May 17, 2019,18:29 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో కలిసి ఆయన మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో మోదీ మీడియా సమావేశంలో మాట్లాడటం ఇదే తొలిసారి. 

ఈ సందర్భంగా ఐదేళ్లు దేశానికి సేవ చేసే అవకాశమిచ్చిన ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రజాస్వామ్యం ఎంతో విలువైనదని, దీంతో ప్రపంచాన్నే మెప్పించామని మోదీ అన్నారు. ప్రజలకోసమే నేను ఆలోచిస్తున్నానంటూ ఎన్నికల ప్రచార సభల్లోని మాటలను గుర్తు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే గొప్పదేశభక్తుడంటూ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యలపైనా మోదీ స్పందించారు. ఆ వ్యాఖ్యలతో పూర్తిగా విభేదిస్తున్నామని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని చెప్పారు. 

భాజాపా అధ్యక్షుడిగా అమిత్‌షా మీడియా సమావేశం నిర్వహించారనీ, ప్రధాని హోదాలో విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వలేనని చెప్పారు. అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో భాజపా చేపట్టిన వివిధ ప్రచార కార్యక్రమాలు, గత ఐదేళ్లలో భాజపా ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి వివరించారు.

Source : Eenadu