ఈసీయే నిబంధనల్ని ఉల్లంఘిస్తోంది: చంద్రబాబు

16babu1a 1
PTI | Updated :May 16, 2019,17:43 IST

అమరావతి: ఎన్నికల నిబంధనల్ని కేంద్ర ఎన్నికల సంఘమే (ఈసీఐ) ఉల్లంఘిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఈసీఐకి ఆయన లేఖరాశారు. ఈసీఐ అప్రజాస్వామికంగా, పక్షపాత వైఖరితో వ్యవహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. తెదేపా చేసిన ఫిర్యాదులను పట్టించుకోకుండా.. వైకాపా చేసిన ఫిర్యాదులను మాత్రమే ఈసీ పరిగనణలోకి తీసుకుందని దుయ్యబట్టారు. తొమ్మిది చోట్ల రీపోలింగ్‌ జరపాలని తాము ఫిర్యాదు చేస్తే.. వాటిని కనీసం పట్టించుకోలేదన్నారు. భాజపా, దాని మిత్ర పక్షాల ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తోందని విమర్శించారు. బెంగాల్‌లో ఒకరోజు ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయడం దారుణమన్నారు. భాజపా ఫిర్యాదులను మాత్రమే ఈసీ పరిగణనలోకి తీసుకుందని, అన్ని పార్టీల ఫిర్యాదులనూ పరిశీలించాలన్నారు. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని.. తెదేపా డిమాండ్‌ చేసిన చోట్లా రీపోలింగ్‌ జరపాలని సీఎం  లేఖలో డిమాండ్‌ చేశారు.

Source : Eenadu