ఐపీఎల్‌లో అత్యధిక రీట్వీట్లు దానికే..

1405iplretweet slider98279
PTI | Updated :May 14, 2019,19:01 IST

న్యూదిల్లీ: ఐపీఎల్‌ సందర్భంగా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ట్వీట్లు వెల్లువెత్తాయి. 12వ సీజన్‌లో మొత్తం 27 మిలియన్ల ట్వీట్లు నమోదయ్యాయి. గత సీజన్‌తో పోలిస్తే ఇది 44శాతం అధికం. ఇవి మార్చి 1 నుంచి మే 13వరకు ఉన్నవి. మెన్షన్స్‌ విషయానికి వస్తే ముంబయి ఇండియన్స్‌ డామినేషన్‌ స్పష్టంగా కనిపించింది. దాదాపు 63శాతం ముంబై ఇండియన్స్‌కు రాగా  చెన్నై సూపర్‌ కింగ్స్‌కు 37శాతం వచ్చాయి. ఇక 2019 సీజన్‌లో అత్యధికంగా ఏదైనా టీం గురించి  ట్విట్లు చేశారు అంటే అది చెన్నై సూపర్‌ కింగ్స్‌ పైనే. ఆ తర్వాత స్థానంలో ముంబయి ఇండియాన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఉన్నాయి. 
అత్యధికంగా రీట్వీట్‌ అయిన ట్వీట్‌ మాత్రం  హార్దిక్‌పాండ్యాదే. ‘‘నా స్పూర్తి, నా మిత్రుడు, నా సోదరుడు, నా లెజెండ్‌ ఎం ధోనీ’’ అని హార్దిక్‌ పాండ్యా మే8వ తేదీన చేసిన ట్వీట్‌ 16 వేల సార్లు రీట్వీట్‌ చేశారు. ఒక ధోని (తలై) గురించి  అత్యధిక సార్లు ట్వీట్లు వెల్లవెత్తాయి. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ, రోహిత్‌శర్మ, హర్బజన్‌, రసెల్‌ ఉన్నారు. 
ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకొని ట్విటర్‌ ఐపీఎల్‌ ఎమోజీలను కూడా విడుదల చేసింది. ‘‘ఫ్యాన్స్‌ క్రికెట్‌ గురించి ట్వీట్‌చేయడాన్ని ఇష్టపడతారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో రికార్డు బ్రేకింగ్‌ స్థాయిలో 27 మిలియన్ల ట్వీట్లు వచ్చాయి. ప్రపంచ క్రీడల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి , చెప్పడానికి ట్విటర్‌ అత్యుత్తమ మార్గం. ఐపీఎల్‌ సంభాషణలు ఈ సారి విపరీతంగా పెరిగాయి’’ అని ట్విటర్‌ ఇండియా పేర్కొంది. 

Source : Eenadu