‘వన్‌ప్లస్‌ 7’ వచ్చేశాయ్‌... ధరెంతో తెలుసా?

13 39
PTI | Updated :May 14, 2019,18:14 IST

బెంగళూరు: ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లు... అందుబాటులో ధరలో అంటూ వన్‌ప్లస్‌ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ‘వన్‌ప్లస్‌’ నుంచి ఏడో సిరీస్‌ ఫోన్లు ఈ రోజు విడుదలయ్యాయి. వన్‌ప్లస్‌ నుంచి ఒకేసారి రెండు మొబైల్స్‌ విడుదలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వీటి కోసం వన్‌ప్లస్‌ బెంగళూరు, లండన్‌, న్యూయార్క్‌లో ఒకేసారి లాంచ్‌ ఈవెంట్లు నిర్వహించింది. ఇందులో వన్‌ప్లస్‌ 7, వన్‌ప్లస్‌ 7 ప్రో మొబైల్స్‌ను లాంచ్‌ చేసింది.  వీటిలో సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ ఉంటుంది. ఈ నెల 17 నుంచి అమెజాన్‌లో అమ్మకాలు మొదలవుతాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులు 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఎస్‌బిఐ క్రెడిట్‌/డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 2000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ మొబైల్స్‌ ధర, మరిన్ని ప్రత్యేకతలు ఇవీ... 

వన్‌ప్లస్‌ 7 ప్రో ప్రత్యేకతలు

* 6.67 అంగుళాల ఆల్‌ స్క్రీన్‌ ఫ్లూయిడ్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే
* 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో క్వాడ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
* క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌
* 6 జీబీ/8 జీబీ/ 12 జీబీ ర్యామ్‌... 128 జీబీ/256 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్‌లు
* వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌ ఉంటుంది. అందులో 48 ఎంపీ, 16 ఎంపీ అల్ట్రావైడ్‌ సెన్సర్‌, 8 ఎంపీ టెలీఫొటో లెన్స్‌ ఉంటాయి.
* ముందువైపు 16 ఎంపీ పాప్‌అప్‌ సెల్ఫీ కెమెరా
* 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ... 30 వాట్‌ వ్రాప్‌ ఛార్జింగ్‌ సదుపాయం
హైడైనమిక్‌ రేంజ్‌  హెఛ్‌డీఆర్‌ 10/10+ వీడియో
* 6 జీబీ+128 జీబీ ధర రూ. 48,999... 8జీబీ+256జీబీ ధర రూ. 52,999... 12 జీబీ+256 జీబీ ధర రూ. 57,999 

 

వన్‌ప్లస్‌ 7 ప్రత్యేకతలు

* 6.41 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ తాకే తెర
* వాటర్‌ డ్రాప్‌ నాచ్‌తో 60హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ స్క్రీన్‌
* క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రోసెసర్‌
* 6 జీబీ, ర్యామ్‌, 8 జీబీ, ర్యామ్‌, 128 జీబీ, 256 జీబీ అంతర్గత మెమొరీ
* వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరా, 5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
* 3700 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* 20 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం
* 6జీబీ+128 జీబీ ధర రూ.32,999, 8 జీబీ+256 జీబీ ధర 37,999

Source : Eenadu