శ్రీలంక పేలుళ్లు.. 310కి చేరిన మృతుల సంఖ్య

9a58798aadbc0f0cea7f985b5ba3ab17
PTI | Updated :April 23, 2019,05:25 IST

శ్రీలంక వరుస పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 310కి చేరుకున్నది. ఆ పేలుళ్లలో 500 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు పోలీసులు ఉగ్ర ఘటనకు సంబంధించి 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ జాతీయ సంతాప దినాన్ని పాటిస్తున్నారు. బాంబు పేలుళ్ల ఘటనలో విచారణకు సహకరించేందుకు ఇంటర్‌పోల్ ఓ టీమ్‌ను శ్రీలంకకు పంపించింది. శ్రీలంక పేలుళ్ల ఘటనను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మద్దతుదారులు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. క్రైస్ట్‌చర్చ్ దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయని ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ గ్రూపు కూడా పేలుళ్లకు బాధ్యత వహించలేదు. లంక ఇంటెలిజెన్స్ మాత్రం తౌహీద్ జమాతేను అనుమానిస్తున్నది. షాంగ్రిలా హోటల్‌లో ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తిని ఇన్‌సాన్ సీలావన్‌గా గుర్తించారు. అవిసవెల్లా-వెల్లంపిటియా రోడ్డులో అతనికి ఫ్యాక్టరీ ఉన్నది. ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులను పోలీసులు విచారణ నిమిత్తం అరెస్టు చేశారు. సూసైడ్ బాంబర్‌కు ఇతర కిల్లర్స్‌తో లింకులు ఉండి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Source : Dailyhunt

From Around the web