మోదీపై విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు

98795kar
PTI | Updated :April 20, 2019,04:15 IST

ప్రధానమంతి నరేంద్ర మోదీ వంటి నేరచరిత ఉన్నవారు ఇంకొకరు ఉండరంటూ తెలుగు సినీ నటి విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని ముదోళ్‌లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నేను భాజపా నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను. అందుకే ఆ పార్టీ నేతల నేపథ్యమేమిటో తెలుసు. ఓ ప్రధానికి ఉండాల్సిన లక్షణాలు మోదీలో లేవు. ఈ ఎన్నికలు రాహుల్‌గాంధీ- మోదీల మధ్య పోరు’ అంటూ వివరించారు. ఐదేళ్లలో మోదీ కేవలం అబద్ధాలతోనే దేశాన్ని మోసగించారని దుయ్యబట్టారు. భాజపా ప్రలోభాలకు గురిచేసినా ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని ప్రజలకు సూచించారు. సేడంలో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న కారణంగా ఆమె ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కలబురగి కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే, మాజీ మంత్రి శరణ్‌ ప్రకాశ్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతిని ఘనంగా సత్కరించారు.

 

Source : Eenadu