సతీమణి సమాధి వద్ద కుప్పకూలిన పల్లె

090419palle brk 1
PTI | Updated :April 10, 2019,19:52 IST

పుట్టపర్తి: అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పుట్టపర్తి తెదేపా అభ్యర్థి పల్లె రఘునాథరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. తన సతీమణి సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళ్లిన ఆయన.. అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయన వెంట ఉన్న అనుచరులు, బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రఘునాథరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పల్లెను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. రేపు ఉదయానికల్లా పల్లె కోలుకుంటారని వైద్యులు చెప్పారన్నారు. ఎండల్లో విరామం లేకుండా తిరగడం వల్లే పల్లె అస్వస్థతకు గురయ్యారని జేసీ అన్నారు. ఎండల వల్ల పలువురు తెదేపా నాయకులు అనారోగ్యం పాలయ్యారనీ, అన్ని పార్టీల అభ్యర్థులదీ ఇదే పరిస్థితి అని జేసీ వివరించారు.

Source : Eenadu