అగ్రిగోల్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఆకస్మిక మృతి

1agrigold1a
PTI | Updated :April 01, 2019,18:27 IST

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఇమ్మడి సదాశివ వరప్రసాదరావు ఆకస్మికంగా మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ కౌంటర్‌ నుంచి సోమవారం  బయటకు వస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు నీళ్లు తాగించి, హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వరప్రసాదరావు వద్ద లభ్యమైన వివరాల ఆధారంగా గోపాలపురం పోలీసులు హైదరాబాద్‌లోని మృతుని బంధువులకు సమాచారం అందించారు. వరప్రసాదరావు విజయవాడకు చెందినవారు.  బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ ఎం.నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

Source : Eenadu