కర్నూలు జిల్లా ఖగ్గల్‌లో ఉద్రిక్తత

Break9a 7
PTI | Updated :March 16, 2019,05:45 IST

కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఖగ్గల్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ జెండా ఆవిష్కరణకు వచ్చిన మంత్రాలయం తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిని వైకాపా నాయకులు అడ్డుకుని దాడికి యత్నించారు. ఈ క్రమంలో తిక్కారెడ్డి గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరపడంతో ప్రమాదవశాత్తూ తిక్కడారెడ్డి సహా ఏఎస్‌ఐ గాయపడ్డారు.

మంత్రాలయం అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తిక్కారెడ్డి శనివారం ఉదయం మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో ఖగ్గల్‌ వెళ్లారు. తొలి నుంచి వైకాపాకు పట్టున్న గ్రామమైన ఖగ్గల్‌లో తెదేపా జెండా ఆవిష్కరించడానికి తిక్కారెడ్డి సహా పలువురు కార్యకర్తలు అక్కడకి చేరుకున్నారు. దీంతో వైకాపా అభ్యర్థి బాలనాగిరెడ్డి భార్య జయమ్మ, ఆయన కుమారుడు ప్రదీప్‌రెడ్డి గ్రామస్థులతో కలసి అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో తిక్కారెడ్డి గన్‌మెన్‌ గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రమాదవశాత్తూ తిక్కారెడ్డి ఎడమకాలికి బుల్లెట్‌ గాయమైంది. మాధవరం ఏఎస్‌ఐ వేణుగోపాల్‌ కుడి కాలికి గాయమైంది. దీంతో వారిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించారు.

Source : Eenadu