తన నిజస్వరూపాన్ని బైటపెట్టిన చైనా ధన్యవాదాలు చెప్పిన పాక్‌

China 4
PTI | Updated :March 07, 2019,18:16 IST

చైనా ఉప విదేశాంగమంత్రి కాంగ్‌ జున్‌యు గురువారం పాకిస్థాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ప్రస్తుతం పాక్‌ పర్యటనలో ఉన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చిందుకే కాంగ్ జున్‌యు ఇస్లామాబాద్‌ వెళుతున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఇందులో భాగంగా భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ పాక్‌ సంయమనం పాటిస్తుందని కాంగ్‌ ప్రశంసించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

‘ భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న పరిస్థితులను చైనా చర్చిస్తోంది.భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నివారణకు కృషిచేస్తామని కాంగ్‌ అన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వ్యాఖ్యలకు స్పందించిన పాక్‌ ప్రభుత్వం చైనాకు ధన్యవాదాలు తెలిపింది.పుల్వామా దాడి జరిగిన సమయంలోనూ డ్రాగన్‌ భారత్‌కు మద్దతుగా నిలవలేదు. జైషే అధినేత మసూద్‌ అజర్‌ను చైనా వెనకేసుకొచ్చింది. భారత్‌ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు చైనా ఉగ్రవాదం విషయంలో పాత పాటే పాడింది. ఇప్పుడు పాక్‌ను ప్రశంసించి మరో సారి తన నిజ స్వరూపాన్ని బయట పెట్టింది.

 

Source: Eenadu