‘ప్లీజ్‌ మేడమ్‌.. సల్మాన్‌ను పెళ్లి చేసుకోండి..’

18brk kar
PTI | Updated :February 19, 2019,05:37 IST

 బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. కత్రినాకు ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించేది సల్మానే అనడంలో ఏ సందేహం లేదు. కెరీర్‌ పరంగా కత్రినకు సల్మాన్‌ ఎంతో సాయం చేశారు. ఒకప్పుడు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల కత్రినా ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ‘సల్మాన్‌ను పెళ్లిచేసుకోవచ్చుగా..’ అని ఓ అభిమాని ఆమెను నిర్మొహమాటంగా అడిగేశారు.

ఇందుకు కత్రినా ఇచ్చిన సమాధానం కూడా వైరల్‌ అవుతోంది. ఇటీవల కత్రినా ఫేమస్లీ ఫిలింఫేర్‌ అనే కార్యక్రమానికి అతిథిగా వెళ్లారు. ఆ కార్యక్రమానికి వచ్చిన అభిమానుల్లో ఓ వ్యక్తి సల్మాన్‌, కత్రినా జంటగా నటిస్తున్న ‘భారత్’ పోస్టర్‌ పట్టుకుని దానిపై ‘ప్లీజ్‌ మేడమ్‌.. సల్మాన్‌ మీకు పర్‌ఫెక్ట్‌. ఆయన్ను పెళ్లి చేసుకోండి’ అని రాశారు. ఆ పోస్టర్‌ చూసిన కత్రినా ‘ఊ..నీ ప్రశ్నకు ఇదే నా రియాక్షన్‌’ అని సమాధానమిచ్చారు. అయితే కత్రినా రియాక్షన్‌ పెళ్లికి ఓకేనా? కాదా? అన్నది అర్థంకాక అభిమానులు తికమకపడుతున్నారు.

కత్రినా, సల్మాన్‌ జంటగా ‘మైనే ప్యార్‌ క్యూ కియా’, ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ వంటి ఎన్నో చిత్రాల్లో జంటగా నటించారు. ప్రస్తుతం ‘భారత్’ సినిమా చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రంజాన్‌కు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Source: Eenadu