‘మహర్షి’ని చూస్తే గుండె బరువెక్కడం ఖాయమట..

Mahesh babu maharshi telugu movie star cast release date budget mt wiki first look poster
PTI | Updated :February 16, 2019,04:43 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ కొన్ని సరికొత్త గెటప్స్‌లో కనిపిస్తాడనే టాక్ ఒకపైపు నడుస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఎమోషన్ కూడా భారీగానే ఉంటుందట.
 
తల్లిదండ్రులు, స్నేహితులు, రైతులు మధ్య నడిచే ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులను కదిలిస్తాయని సమాచారం. దిల్ రాజు కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బరువెక్కిన హృదయంతో బయటకు వస్తారంటూ సినిమాలో ఏ స్థాయిలో ఎమోషన్ ఉంటుందో చెప్పకనే చెప్పారు. మొత్తంగా ‘మహర్షి’ చిత్రాన్నిచూస్తే గుండె బరువెక్కడం మాత్రం ఖాయమట.

 Source : Andhra jyothy