‘మహర్షి’ని కలిసిన ‘దేవ్‌’

13brkmahesh1
PTI | Updated :February 13, 2019,10:41 IST

 అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబును తమిళ స్టార్ కార్తి కలిశారు. ‘మహర్షి’ సినిమా సెట్‌కు కార్తి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరు హీరోలు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కనిపించారు. మహేశ్‌ను కార్తి ఎందుకు కలిశారో తెలియాల్సి ఉంది. కన్నడ స్టార్‌ శ్రీమురళి కూడా మంగళవారం మహేశ్‌ను కలిశారు. రామోజీఫిల్మ్‌ సిటీలో జరుగుతున్న ‘మహర్షి’ సినిమా షూట్‌కు ఆయన వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి.

మహేశ్‌ ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్నారు. దిల్‌రాజు, అశ్వనీదత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘దేవ్‌’ చిత్రంలో కార్తి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించారు. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Source : Eenadu