వైకాపా సైకో పార్టీగా మారింది : చంద్రబాబు

19 2352
PTI | Updated :February 04, 2019,05:48 IST

భాజపాయేతర పక్షాలు ఈవీఎంలపై ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేయాలని ముందుగా నిర్ణయించాయని.. ఇది తెలిసి వైకాపా అధినేత జగన్ హడావుడిగా దిల్లీ వెళ్ళారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. మోదీ కనుసన్నల్లో జగన్ ఈసీని కలిసి ఏదో ఫిర్యాదు అని నాటకమాడుతున్నారని దుయ్యబట్టారు. వైకాపా సైకో పార్టీగా మారిందని మండిపడ్డారు. వచ్చే పరిశ్రమలను అడ్డుకుంటూ.. పెట్టుబడులు రాకుండా కుట్రలు చేస్తున్నారని జగన్‌పై ఆగ్రహాం వ్యక్తంచేశారు. ప్రజలు కష్టాల్లో ఉండాలన్నదే సైకో వైకాపా ధోరణి అని విమర్శించారు. పింఛన్ల సభలు, ‘పసుపు-కుంకుమ’ కార్యక్రమాలను భగ్నం చేయడం జగన్ శాడిజానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

Source ; Eenadu