గజినీ 2 ?

Allu aravind
PTI | Updated :January 13, 2019,02:50 IST

తెలుగు ఆడియన్స్‌కు సూర్యను బాగా దగ్గర చేసిన చిత్రం ‘గజిని’. ఈ తమిళ సూపర్‌ హిట్‌ను తెలుగులో అల్లు అరవింద్‌ రిలీజ్‌ చేశారు. తమిళంలోలానే ఇక్కడా ఘనవిజయం సాధించింది. అంతే కాదు హిందీ వెర్షన్‌ను ఆమిర్‌తో నిర్మించారు అరవింద్‌. ఇప్పుడు ఈ సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై ‘గజినీ 2’ అనే టైటిల్‌ను తెలుగు, తమిళ భాషల్లో రిజిస్టర్‌ చేయించినట్టు తెలిసింది. మరి ఈ సినిమా సూర్య, మురుగదాస్‌ కాంబినేషన్‌లోనే ఉంటుందా? కాంబినేషన్‌ మారుతుందా? వేచి చూడాలి.

Source : Sakshi