కేసీఆర్‌పై చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ?

Vija
PTI | Updated :November 06, 2018,05:03 IST

 హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు మైత్రీబంధంపై ట్విటర్‌లో స్పందించారు. ‘ఎంత డబ్బు అయినా పంపిస్తా, టీఆర్‌ఎస్‌ మాత్రం గెలవొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నాడట. ఇంత ప్రేమ ఎందుకంటే కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే ఓటుకు నోటు కేసు విచారణ స్పీడప్‌ చేసి ఎక్కడ లోపల వేస్తాడోనని చంద్రబాబుకు భయం పట్టుకుంద’ని ఎద్దేవా చేశారు. 

ఐటీ సోదాల నుంచి రక్షణ పొందేందుకే చంద్రబాబు రాహుల్ గాంధీతో చంద్రబాబు పూసుకు తిరుగుతున్నారని విజయసాయిరెడ్డి అంతకుముందు ఆక్షేపించారు. జాతీయస్థాయి నాయకుడినని ఐటీ శాఖను బెదిరించాలని చూస్తున్నారని విమర్శించారు. చిదంబరం, రాబర్ట్ వాద్రాలే అక్రమ సంపాదన కేసుల్లో ఇరుక్కుని ఉన్నారని, రాహులేం కాపాడతారని ఎద్దేవా  చేశారు.

Source : Sakshi