చంద్రబాబు ఇదేనా నీ వీరత్వం..శూరత్వం?

Rahulgandhi chadnrababu 2
PTI | Updated :November 02, 2018,10:49 IST

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్‌

సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్‌, టీడీపీల కలయికపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీటర్‌ వేదికగా విమర్శించారు. గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. గతం గతహా.. అని, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తామని ఈ ఇద్దరు స్పష్టం చేశారు. అయితే ఏడాది క్రితం వరకు కాంగ్రెస్‌ భూస్థాపితం చేస్తామన్న చంద్రబాబు ఎవరి శరణుకోసం పొర్లు దండాలు పెడ్తున్నారని ప్రశ్నించారు. ఇదేనా మీ వీరత్వం, శూరత్వం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఆ పార్టీ వెంటిలేటర్‌పై ఉంది. అది తీసేస్తే చచ్చినట్లే. ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు విశ్రమించేది లేదు.’ అని ఏడాది క్రితం వరకు ప్రతి వేదికపైన చంద్రబాబు చెప్పిన భారీ డైలాగ్స్‌. ఇప్పుడు... శరణు కోరుతూ కాంగ్రెస్‌కు పొర్లు దండాలు.. అహా! ఏం వీరత్వం, శూరత్వం?’ అని సెటైరిక్‌గా ట్విట్‌ చేశారు. ఇక కాంగ్రెస్‌-టీడీపీల పొత్తుపై ఆయా పార్టీల కార్యకర్తలు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు. 

Source : Sakshi