ఏపీలో శాంతి భద్రతలు కనుమరుగు: పురందేశ్వరి

Purandeswari
PTI | Updated :October 31, 2018,08:26 IST

తిరుపతి : ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే.. కత్తి అంగులం దిగిందా.. అర అంగులం దిగిందా అని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైనది కాదన్నారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో శాంతి భద్రతలు కనుమరుగయ్యాయని ఆరోపించారు. అమిత్‌ షా, కన్నా లక్ష్మీనారాయణలపై దాడి జరిగిందంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతమాత్రం అదుపులో ఉన్నాయో అర్దమవుతుందన్నారు. వైఎస్‌ జగన్‌పై దాడికి పాల్పడిన వ్యక్తికి పోలీసులే మంచి వ్యక్తని సర్టిఫికెట్లు ఇస్తున్నారని విమర్శించారు.

దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించే దిశగా మోదీ కృషి చేస్తున్నారన్నారు. బీజేపీని ఓడించడం.. మోదీని గద్దె దించడం ఎవరి వల్ల సాధ్య కాదన్నారు. పరిపూర్ణనందస్వామి ఇష్టపడే బీజేపీలో చేరారని, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన పోటీ చేయరని తెలిపారు. పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ జీవితం తెరచిన పుస్తకమని, ఆయన గౌరవాన్ని దిగజార్చే విధంగా బయోపిక్‌లు ఉండకూడదని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

Source :Sakshi