2.ఓ : అవన్నీ పుకార్లేనట..!

Akshay kumar in 2
PTI | Updated :September 30, 2018,05:58 IST

సౌత్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కిన రోబోకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో విలన్‌గా నటిస్తున్న అక్షయ్‌ కుమార్‌క్యారెక్టర్ విషయంలో చాలా గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే రిలీజ్‌ అయిన అక్షయ్‌ లుక్‌, స్టిల్స్‌ చూసిన సినీ అభిమానులు 2.ఓ సినిమాలో అక్షయ్‌ క్రో మ్యాన్‌(కాకి మనిషి) పాత్రలో కనిపించినున్నాడని కొందరు.. డాక్టర్‌ రిచర్డ్స్‌ అనే సైంటిస్ట్‌ పాత్రలో నటిస్తున్నాడని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయాలపై స్పందించిన దర్శకుడు శంకర్‌ అవన్నీ పుకార్లంటూ కొట్టి పారేశారు. అక్షయ్‌ క్యారెక్టర్‌ ఏంటి అన్న క్లారిటీ ఇవ్వకపోయినా.. క్రో మ్యాన్‌, డాక్టర్‌ రిచర్డ్స్‌మాత్రం కాదని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్‌ చివరి వారంలో రిలీజ్‌ కానుంది.

Source : Sakshi