‘రాజకీయ కక్షతోనే రేవంత్‌పై ఐటీ దాడులు’

Uttam
PTI | Updated :September 27, 2018,05:12 IST

హైదరబాద్ ‌: రాజకీయ కక్షతోనే రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేయిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ ఆరోపించారు. పాత కేసులను బయటకు తీసి కాంగ్రెస్‌ నాయకులను అనగదొక్కే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న జగ్గారెడ్డిపై కేసు, నేడు రేవంత్‌ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు ఇవన్నీ టీఆర్‌ఎస్‌ చేతకాని తనానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్‌ను ఓటమి భయం వెంటాడుతోందని అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ దాడుల నేపథ్యంలో ఉత్తమ్‌తో సహా మరికొంత మంది కాంగ్రెస్‌ నాయకులు మరికాసెపట్లో రేవంత్‌ ఇంటికి వెళ్లనున్నారు.

Source : sakshi